
కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోయాయని రైతు ఆత్మహత్య…
కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మార్గమధ్యలో పోయిందనే బెంగతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని సోమారం తాండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమారం తాండాకు చెందిన గుగులోత్ నరేష్ (32)వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
రూ. 60 వేలు మార్గమధ్యలో పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల 04న వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పురుగుల మందు తాగానని ఆ గ్రామానికి చెందిన బుక్య విగ్నేష్ కు ఫోన్ చేసి తెలపడంతో ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని 108 అంబులెన్స్ ద్వారా కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కొరకు ఎల్లారెడ్డిపేట లోని ఓ ఆసుపత్రికి తరలించగా..పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు నరేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




