PoliticalTelangana

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్ల గ్రామానికి చెందిన​ ఓ ప్రైవేటు పాఠశాల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు.

డ్రైవర్, గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై పిల్లల్ని బస్సు నుంచి కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు.

ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్కూల్ బస్ ఫిట్ నెస్ తోపాటు మంటలు రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు, ప్రాణ నష్టం జరగకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button