EntertainmentHyderabadPoliticalTelangana

ఢీ విన్నర్ రాజు అరెస్టు... బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్ట్

ఢీ విన్నర్ రాజు అరెస్టు... బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్ట్

ఢీ విన్నర్ రాజు అరెస్టు… బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్ట్

Web desc : ఢీ10, 20 టీవీషో విన్నర్ రాజును మియాపూర్ పోలీసులు నిన్న(శనివారం) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు.

ఓ యువతిని లైంగికంగా వేధించాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. సినిమా అవకాశాల పేరుతో మోసం చేసినట్లుగా ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఈనెల 9వ తేదీన రాజుపై కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ కేసులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.పెళ్లి పేరుతో తనకు దగ్గరై రూ.12 లక్షలు తీసుకొని డ్యాన్సర్ రాజు మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. యువతిని మోసం చేసి మరో సీరియల్ నటితో తిరుగుతున్నట్లుగా రాజుపై ఆరోపణలు ఉన్నాయి.

అతనిపై కేసు పెట్టిన బాధితురాలిపై సీరియల్ నటి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. రాజుపై తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోషియేషన్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. సుమలత, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button