
ఏదులాపురంలో పీఎస్ఆర్ యూత్ ‘బైక్ ర్యాలీ’ సక్సెస్
ఏదులాపురం : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఎస్ఆర్ యూత్ ఖమ్మం నగర అధ్యక్షుడు దుంపల రవి కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతమైంది.
మారెమ్మ గుడి నుంచి వెంకటగిరి క్రాస్ రోడ్డు వరకు వందలాది బైక్‌లతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కళ్లెం వెంకట్ రెడ్డి, అజ్మీర అశోక్ నాయక్, ఇమామ్, మజీద్, ఏనుగు మహేష్ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
పీఎస్ఆర్ యూత్ అధ్యక్షుడు దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీతో ఏదులాపురం పురవీధులన్నీ ‘జై కాంగ్రెస్’ నినాదాలతో హోరెత్తాయి. యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ర్యాలీ ఆద్యంతం జోష్‌గా సాగింది.




