NationalNotificationPolitical

పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతోనే ఆర్మీ ఉద్యోగం!

పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతోనే ఆర్మీ ఉద్యోగం!

పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతోనే ఆర్మీ ఉద్యోగం!

Web desc : భారత సైన్యంలో ఆఫీసర్ హోదాలో దేశానికి సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీ అద్భుతమైన అవకాశం కల్పించింది. ఆర్మీలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల యువతీ యువకులు ఆన్‌లైన్ విధానంలో ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుంచి సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి ప్రధాన ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ (BE) లేదా బీటెక్ (B.Tech) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టెక్నికల్ రంగంలో ఆర్మీలో స్థిరపడాలనుకునే నిపుణులకు ఇది మంచి వేదికగా నిలవనుంది.

ఏజ్ లిమిట్ .. ఏప్రిల్ 1, 2027 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ వయోపరిమితి లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులుగా పరిగణించబడతారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7, 2026 ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోపే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే సాగనుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారికి, వైద్య పరీక్షల అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణ సమయం నుంచే అత్యుత్తమ జీతభత్యాలు అందుతాయి.

విధుల్లో చేరిన మొదటి నెల నుంచే దాదాపు రూ.1,50,000 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది. జీతంతో పాటు సైన్యంలో లభించే ఇతర రాయితీలు, క్వార్టర్స్ వంటి సౌకర్యాలు కూడా అందుతాయి. అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్ https://www.joinindianarmy.nic.in/ ను సందర్శించవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button