
మక్తల్ మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా…
నారాయణపేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికను వాయిదా వేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ ఆత్మహత్యతో ఎన్నికను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా.. ఫిబ్రవరి 9న రాత్రి మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. మహదేవ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రత్యర్థుల వేధింపులతోనే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. ఎన్నికలకు ఒక్క రోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు ఎరుకలి మహాదేవప్ ఆత్మహత్య నిరసనగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో లక్డీకపూల్ లోని డీజీపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు భారీగా మోహరించారు.
మహాదేవప్ప మృతిపై భగ్గుమన్న బండి సంజయ్ ఈ క్రమంలో మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని, అరాచకాలు తట్టుకోలేక మహదేవప్ప ప్రాణాలు విడిచాడు అని అన్నారు.
కాంగ్రెస్ ను రాళ్ళతో కొట్టే పరిస్థితి రాబోతుందని ఆయన పేర్కొన్నారు. మా సహనాన్ని పిరికితనం గా భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పైన యుద్ధం చేయబోతున్నాం . ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పైన యుద్ధం చేయబోతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలారా….ధైర్యంగా ఉండండి, బిజెపి నాయకత్వం మీకు అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాలి . మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బయలుదేరారన్నారు.
మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.




