
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు అర్హతగల విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ , MD ఎ. సోనిబాల దేవి.
తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాల, హకీంపేట్ లో విద్యా సంవత్సరం 2026-27 నకు నాలుగవ తరగతిలో ప్రతిభగల విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) వైస్ చైర్మన్, MD ఎ. సోనిబాల దేవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా, 26.02.2026 నుండి 04.03.2026 వరకు వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
సెలెక్షన్లలో భాగంగా మండలం, జిల్లా అలాగే రాష్ట్ర స్థాయిల్లో 9 మోటర్ క్వాలిటీ పరీక్షలు జరుగుతాయని, రాష్ట్ర స్థాయిలో మెడికల్ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.
వయోపరిమితి: బాల, బాలికలు 01.09.2017 నుండి 31.08.2018 మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు.
అభ్యర్థులు సెలెక్షన్ల సమయంలో సమర్పించవలసిన పత్రాలు:
ఒరిజినల్ ఆధార్ కార్డు
3వ తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్
జనన ధ్రువీకరణ పత్రం (Birth certificate)
3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టులు
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (Community certificate)
5 పాస్ పోర్ట్ ఫోటోలు సమర్పించాలని అలాగే
మరిన్ని వివరాలక పై తెలిపిన వెబ్సైటు ను సంప్రదించగలరని తెలిపారు.



