PoliticalTelangana

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు…రెండు విడతలుగా

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు…రెండు విడతలుగా

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు…రెండు విడతలుగా

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే అదే ఊపులో పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది.

అప్పుడే గెలుపు సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. ఈ వేడిలోనే ఎన్నికలు జరిపించాలని, రేపటి ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మార్చి తొలి వారంలో…మరొక వైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన 450 కోట్ల రూపాయల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది.

అందుకే పరిషత్‌ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి తొలివారంలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగనున్నట్లు అధికారికవర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button