
లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం.. ప్రాణాలు తీస్తున్న అతివేగం
Web desc: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం జాతీయ రహదారి 365 పై చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆరవయ్యపల్లి గ్రామానికి చెందిన బసవరాజుల కుమారస్వామి (65) రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే మల్లంపల్లి నుంచి అతివేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక నిద్రమత్తులో ఉన్నాడా అనే కోణంలో స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఎస్సై గోవర్ధన్ ను వివరణ కోరగా విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని అన్నారు.



