HyderabadKhammamPoliticalTelangana

సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల...

సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల...

ముఖ్యమంత్రి రేవంత్ తో మంత్రి తుమ్మల భేటీ
•ఖమ్మంలో టీటీడీ దేవస్థానానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి
•ద్వంసలాపురం రెవెన్యూ పరిధిలో స్థలం కేటాయింపుకు క్యాబినెట్ ఆమోదం
•ఖమ్మంలో టీటీడీ దేవస్థానానికి 20 ఎకరాలు కేటాయింపు
•సీఎం రేవంత్‌తో మంత్రి తుమ్మల భేటీ ఫలితం
•సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల

ఖమ్మం, ఫిబ్రవరి 23:

ఖమ్మం జిల్లాకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక మైలురాయిగా నిలిచే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయ నిర్మాణం కోసం ద్వంసలాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకోబడింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జిల్లాలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, తిరుమల దర్శనానికి వెళ్లలేని భక్తులకు స్థానికంగా టీటీడీ దేవాలయం ఏర్పడితే ఆధ్యాత్మిక అవసరాలు నెరవేరుతాయని ఆయన వివరించారు.

దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, వెంటనే రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలు తడవుగా రెవిన్యూ శాఖ సమన్వయంతో భూమి కేటాయింపునకు కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది.

ఖమ్మానికి ఆధ్యాత్మిక కేంద్రమవుతుందా? ద్వంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంతో పాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది ఖమ్మం నగర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, భక్తులకు మరింత సౌలభ్యం కల్పించనుంది.

మంత్రి తుమ్మల ధన్యవాదాలు… భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. “ఖమ్మం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది. త్వరలోనే టీటీడీ అధికారులతో సమావేశమై నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేస్తాం” అని మంత్రి తుమ్మల వెల్లడించారు.

అభివృద్ధి–ఆధ్యాత్మికతకు నాంది….

ఈ నిర్ణయం ద్వారా ఖమ్మం జిల్లాలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపిరి లభించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, వ్యాపార వర్గాలకు కూడా లాభాలు చేకూరే అవకాశముంది.

క్యాబినెట్ ఆమోదంతో భూమి కేటాయింపు అధికారికంగా అమలులోకి రావడంతో, టీటీడీ దేవాలయ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో హర్షాతిరేకం రేపుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button