
సర్పంచులను అవమానించిన డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ లను సస్పెండ్ చేయాలి
అధికారుల పై చట్టపరమైన చర్యలు గూర్చి మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారికి ఫిర్యాదులు చేస్తాం
డిపిఓ జగదీశ్వర్, డిఎల్పిఓ శ్రీనివాస్ లు మా ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ, సర్పంచులకు వెంటనే క్షమాపణ చెప్పాలి
టి పి సి సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ స్టేట్ ఇంచార్జి తిప్పారావు సంపత్ హుజురాబాద్ మండలం సింగపూర్ కిడ్స్ కాలేజీలో గత రెండు రోజులుగా.సైదాపూర్, వీణవంక మండలాల 53 మంది నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న జనరల్ ఓరియంటేషన్ శిక్షణలో అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కించపరిచేలా ఉందని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ స్టేట్ ఇంచార్జ్ తిప్పారపు సంపత్ తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు.
శిక్షణ పేరుతో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, మహిళా సర్పంచులను అవమానపరిచే విధంగా ఒక నేరస్తులుగా, ఒక స్కూలు పిల్లలుగా, నిలిచోబెట్టిన డిపిఓ జగదీశ్వర్, డి ఎల్ పి ఓ శ్రీనివాస్, ఎంపీడీవో యాదగిరి సైదాపూర్, ఎంపీడీవో రాజేశ్వరరావు ఇల్లంతకుంట, ఎంపీఓ సురేందర్ వీణవంక, గ్రామ సెక్రటరీ రేవంత్ రెడ్డి, స్వచ్ఛభారత్ రమేష్ లు కుర్చీలపై కూర్చొని సర్పంచ్ లను నిలబెట్టడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని మా సర్పంచులను నిలబెట్టి, తాము మాత్రం కుర్చీల్లో కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తూ అహంకారాన్ని ప్రదర్శించారని ఆరోపించారు.
పోలీసులు నేరస్తులను మీడియా ముందు ఎలాగైతే నిలబెట్టి ఫోటోలు తీస్తారో, అదే విధంగా నూతన సర్పంచులను నిలబెట్టి ఫోటోలు దిగడం వారిని అవమానించడమేనని తిప్పారపు సంపత్ పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులను అవమానపరిచిన సదరు అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులకు కనీస గౌరవం ఇవ్వని అధికారులు శిక్షణ ఇవ్వడానికి అనర్హులు. అధికారుల నియంతృత్వ ధోరణిని సహించేది లేదు ఇలాంటి ఘటనలు మా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని తిప్పారపు సంపత్ హెచ్చరించారు
మా సర్పంచ్ లను అవమానించిన ఈ అధికారుల పై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, మా మహిళ సర్పంచులను అవమానించినందుకు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారికి ఫిర్యాదు చేస్తాము,
కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, వివిధ పార్టీల సర్పంచులను అవమానించిన ఘటనను జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకొని వారి పై సస్పెన్షన్ వేటు వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము
ఈ సమావేశంలో టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడీ రవితేజ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ చిట్యాల రేవంత్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రేణిగుంట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు



