
నాటు వైద్యం మందు వికటించి యువతి మృ*తి
Web desc : నాటు వైద్యం మందు వికటించి యువతి మృ*తి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని రాంనగర్ కాలనీలో అద్దెకు నివాసం ఉంటున్నాడు.
తన కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని అప్పటికే రెండు సార్లు ఆ యువకుడితో పారిపోయే ప్రయత్నం చేయడంతో పట్టుకొచ్చారన్నారు.
సదరు యువకుని పై కేసు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు నచ్చజెప్పినా తల్లిదండ్రుల మాట వినడం లేదని యువతి శరీరంలో మందు ఉంది అనే మూఢనమ్మకంతో నాటు వైద్యం చేయించారన్నారు.
నాటు వైద్యం వికటించి శరీర అవయవాలు క్షీణించి గురువారం మరణించినట్లు సమాచారం. కన్న తండ్రే బలవంతంగా నోట్లో చెట్ల మందు పోయించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గురువారం యువతి మరణించడంతో తండ్రి గుట్టు చప్పుడు కాకుండా కడుపునొప్పితో మృతి చెందిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




