
ఖమ్మం జిల్లాలో 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు
ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ఉపాధ్యాయులపై డీఈఓ చైతన్య జైని కొరడా ఝళిపించారు.
ఎలాంటి కారణం చూపకుండా పాఠశాలలకు గైర్హాజరైన 34 మందికి, ఓడీ పేరుతో అనుమతి లేకుండా గైర్హాజరైన మరో 14 మందికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మధిర మండలం దెందుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చారు.
ఏన్కూరు మండల పరిషత్ పాఠశాలలో ఇటీవల ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు వెళ్లిన కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు పాఠశాల హెచ్‌ఎం జయను సస్పెండ్ చేశారు.



