
సచివాలయం పైకి ఎక్కి సర్పంచ్ భర్త హల్చల్…
Web desc : అధికారుల యంత్రాంగం వస్తేనే తాను కిందికి వస్తానంటూ … బుధవారం కాకినాడ జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామ సర్పంచ్ భర్త చీపురుపల్లి రాఘవ సచివాలయం పైకి ఎక్కి హల్చల్ చేశారు.
గ్రామంలోని సమస్యలు, అబివృద్ధి పనుల కోసం తాను రూ.25 లక్షలు వరకు సొంత డబ్బులు ఖర్చు చేశానన్నారు.
తనకు ఇవ్వాల్సిన బిల్లులు పంచాయతీ కార్యదర్శి పెట్టడంలేదని ఆరోపించారు. తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రఘునాథరావు గుర్రంపాలెంకు చేరుకొని సచివాలయం తలుపులు తీసి ఆయనను కిందికి దింపారు.



