PoliticalTelangana

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మ*హత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మ*హత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మ*హత్య

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్ (38) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ*హత్య చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

సింగరేణి సంస్థ ఆర్జీ- 3 పరిధిలోని సెంటినరిరాలనీ నర్సరీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

మంగళవారం రాత్రి దేవేందర్ పేరపల్లిలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గుండారం శివారులోని ఓ పత్తి చేసులో దేవేందర్ మృతదేహం కనిపించింది.

దేవేందర్ గత 15 ఏళ్ల క్రితం పేరపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆశీష్, కుమార్తె కీర్తన ఉన్నారు. భార్య, భర్త మధ్య రెండేళ్లుగా విభేదాలు జరుగుతున్నాయి .

ఏడాదిగా ఇద్దరి పిల్లలతో కలిసి తన తల్లిగారింటికి మల్లేశ్వరి వెళ్లిపోయింది. అప్పటి నుండి దేవేందర్‌ మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసై మంగళవారం ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button