
విద్యార్థిని ప్రసవం కేసు ఛేదించిన పోలీసులు
Web desc : వైద్య పరీక్షలకు వచ్చి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్‌లో మగ బిడ్డను జన్మనిచ్చిన కేజీబీవీ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌యాదవ్ బుధవారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేజీబీవీ విద్యార్థిని వైద్య పరీక్షల కోసం వచ్చి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో మగ బిడ్డను జన్మనిచ్చి బిడ్డను చెత్తబుట్టిలో వేసి తప్పించుకుని వెళ్లే క్రమంలో నిర్వాహకులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పడంతో కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు.
అయితే విద్యార్థిని తాను గత సంవత్సరం పదవ తరగతి చదువుకునేటప్పుడు ఒక విద్యార్థి పరిచయమయ్యాడని, అతని వల్లనే తాను గర్భం దాల్చినట్లు పేర్కొంది.
అయితే ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదంటూ పేర్కొన్నాడు. అయితే మహిళా పోలీసుల సమక్షంలో కేజీబీవీ బాలికతో మరోసారి విచారించగా తన ఇంటి సమీపంలో ఉన్న తమ బంధువుతోనే గర్భం దాల్చినట్లు అమ్మాయి పేర్కొంది.
ఈ సంఘటనపై అతన్ని అదుపులో తీసుకుని విచారించగా చేసిన తప్పును ఒప్పుకోవడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో ఆ మైనర్ బాలున్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.



