
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 05 2026: మండల పరిధిలోని గంగుల నాచారం గ్రామంలో వివాహ వేడుక ఘనంగా నిర్వహించబడింది.
ముక్తి వెంకటేశ్వర్లు – విజయ దంపతుల కుమారుడు ప్రవీణ్ వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ సందర్భంగా వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో కొనసాగాలని ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అభినందనలు తెలిపారు. గ్రామంలో ఇలాంటి శుభకార్యాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించి తమ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.




