
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడి..
సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో ఆడిట్ అధికారి సంతోష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
రూ.35 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయిన ఆంజనేయులు..
తన రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బకాయి డబ్బుల విషయంగా గత ఆరు నెలలుగా కార్యాలయానికి తిరుగుతున్నట్లు తెలిపారు.
అయితే తన పని చేయాలంటే రూ.40 వేల లంచం ఇవ్వాలని ఆడిట్ అధికారి సంతోష్ డిమాండ్ చేసినట్లు ఆంజనేయులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఏసీబీ అధికారులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించి ట్రాప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆంజనేయులు రూ.35 వేల లంచం అందజేస్తుండగా.. సంతోష్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పట్టుబడిన అధికారి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అతనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.




