
ఘనంగా మెగా కవి సమ్మేళనం
డాక్టర్ కందుల సుధాకర్ సేవారత్న నంది అవార్డు గ్రహీత
15-08-2026 | శనివారం
సి కె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి మండలంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మనభూమి ట్రస్టు, కూసుమంచి రచయితల సంఘం–వికాస వేదిక సహకారంతో మెగా కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తుంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు.
కవి సమ్మేళనంలో సుమారు వందకు పైగా కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వికాస వేదిక సాహితీ సంస్థ ముఖ్య అతిథి లెనిన్ శ్రీనివాస్, బుక్క సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కవులు, రచయితలు, కళాకారులను మనభూమి ట్రస్ట్ చైర్మన్ ఉబ్బేపల్లి అశోక్, కూసుమంచి రచయితల సంఘం బాధ్యులు డాక్టర్ కందుల సుధాకర్, సేవారత్న నంది అవార్డు గ్రహీత, డాక్టర్ మందుల వీరభద్రం నంది అవార్డు గ్రహీతలు ఘనంగా సత్కరించారు.
కవి సమ్మేళన నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన వజ్ర హాస్పిటల్ యాజమాన్యానికి, సాయికిరణ్ అగ్రి ఇండస్ట్రీస్ వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సాహితీ కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని, అంతరించిపోతున్న తెలుగు భాష, కళలను సంరక్షించి ప్రోత్సహించడమే తమ ధ్యేయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తుంబూరి దయాకర్ రెడ్డి, ముదిగొండ మండల పశు వైద్యాధికారి డాక్టర్ పి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.




