
ఉరేసుకుని యువకుడు ఆత్మ*హత్య?
మరిపెడ : ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమంచి తుమ్మల తండా గొర్రెలపాడుకి చెందిన కైలాస్, బుజ్జి దంపతుల కుమారుడు బానోత్ సాయి (25) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధి లోనీ ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే మిత్రుడితో కలిసి మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ గాంధీ సెంటర్ లో ఆగ్రోస్ పైన రూమ్ లో అద్దెకుకుంటున్నారు. తనతోపాటు రూమ్ లో ఉండే మిత్రుడు సాయంత్రం ఇంటి వద్దకు చేరుకుని తలుపు కొట్టగా ఎంతసేపటికి తీయలేదు.
అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా సాయి ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




