
అనుమానస్పదంగా యువకుడి మృ*తి
కూసుమంచి: మండలంలోని జుజ్జులరావు పేట గ్రామంలో గల ఒక హైవే నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువకుడు జుజ్జులరావు పేట గ్రామం వద్ద నిర్మాణ సంస్థ రెడీమిక్స్ యూనిట్లో రావిచెట్టు తండాకు చెందిన బానోత్ తరుణ్(24) అనే యువకుడు నైట్ సెక్యూరిటీగా పని చేస్తున్నాడు.
కాగా, ఎప్పటి లాగానే గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లిన తరుణ్ శుక్రవారం ఉదయం విగత జీవిగా కంటైనర్లో కనిపించాడు.
కాగా, తరుణ్ మెడ మీద ఒక ప్లాస్టిక్ వైర్ ఉంది. క మృతుడి తండ్రి బానోత్. రాజు ఫిర్యాదు మేరకు కూసుమంచి ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నేలకొండపల్లి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



