KhammamPoliticalTelangana

ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన మహిళ…

ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన మహిళ…

ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన మహిళ…

ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్‌లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.

తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది.

అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

ఖమ్మం టూటౌన్‌కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ.. ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది.

ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button