
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య
Web desc : భార్య కొట్లాడి పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోషన్ కాలనీలో నివాసముండే రహమత్ (24) కు మూడేళ్ల క్రితం అదే కాలానికి చెందిన ఫైజ బేగంతో వివాహం జరిగింది. వీరికి 18 నెలల పాప ఉంది. రహమత్ వృత్తిరీత్యా టైల్స్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈమధ్య ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో భార్య తరచూ భర్తతో గొడవ పడుతూ ఉంది. ఆదివారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది.
దీంతో భార్య భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో మనస్థాపానికి గురైన రహమత్ ఇంట్లో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం భార్య భర్త కు ఎన్ని సార్లు ఫోన్ చేసిన తీయకపోవడంతో తన తమ్ముడిని రహమత్ ఇంటికి పంపించింది. బావమరిది డోర్ ఎంతసేపు కొట్టిన తీయకపోవడంతో డోర్ బ్రేక్ చేసి చూడగా రహమత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో రహమత్ బామ్మర్ది పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రహమత్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




