
ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి
హిందువులను కించపరిచే విధంగా అనుచిత వాక్యాలు చేశారని ఆరోపిస్తూ తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యలను ఖండిస్తూ మేడిపల్లి బిజెపి, బి జె వై ఎం నాయకులు బోడుప్పల్ లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు.
ఈ సందర్భంగా కోడిగుడ్లు, టమాటాలతో వారు ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సామేలు 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ సమయంలో మా ఆలయాల వద్దకు వచ్చి దండాలు పెట్టి నన్ను గెలిపించండి అని, ఈరోజు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని లేనియెడల ప్రజలే నీకు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీసులు బీజేపీ, బీజేవైఎం నాయకులను అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



