
టూ టౌన్ ఎస్సై భార్య ఆత్మ*హత్య…
కరీంనగర్ టూ టౌన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఇంట్లో విషాద ఘటన జరిగింది. చంద్రశేఖర్ భార్య కరీంనగర్లోని ఇంటిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
కరీంనగర్ టూ టౌన్లో ఎస్సైగా పని చేస్తున్న చంద్ర శేఖర్ భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్నేరుపప్పు దంచుకుని తిన్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించారు.
వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని హునుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర శేఖర్ భార్య దివ్య మంగళవారం ఇంట్టో గన్నేరు పప్పు దంచి తిన్నడంతో ఆరోగ్యం విషమించింది.
విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థకు గురైన దివ్యను కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందించి హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌లో అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో మరణించారు. దివ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావల్సి ఉంది. చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా వీరు ఏడేళ్ల వయసు వరకు ఉంటుంది.
చిరు ప్రాయంలోనే తల్లిని కోల్పోయిన ఆ బిడ్డలను చూసి స్థానికులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా తోటి సిబ్బంది చంద్రశేఖర్ వద్దకు చేరుకొని ఆయనను పరామర్శిస్తున్నారు.



