HealthHyderabadPoliticalTelangana

నకిలీ దంత వైద్యుడు అరెస్ట్

నకిలీ దంత వైద్యుడు అరెస్ట్

నకిలీ దంత వైద్యుడు అరెస్ట్

పదవ తరగతి పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్ గా అవతారం ఎత్తి 20 ఏళ్లుగా నగరం నడిబొడ్డులో దంత వైద్యునిగా చలామణి అవుతున్న వ్యక్తి బండారం మంగళవారం మధ్యాహ్నం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీసులు ఓ వ్యక్తి ఫిర్యాదుతో బట్టబయలు చేశారు.

నేరేడ్‌మెట్ సత్య ఆదిత్య టవర్స్ లో అంజాలికా డెంటల్ ఆస్పత్రి పేరుతో గత 20 ఏళ్లుగా రమేష్ కుమార్ గుప్తా అమాయక రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.

వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఓటి పోలీసులు అతని ఆసుపత్రిని పరిశీలించి సర్టిఫికెట్లను కోరడంతో అసలు విషయం బయటపడింది.

పదవ తరగతి మాత్రమే చదివిన యూపీ కి చెందిన రమేష్ కుమార్ గుప్తా నగరంలో నకిలీ డాక్టర్ గా అవతారం ఎత్తి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ అంది వచ్చిన సొమ్మును దండుకున్నాడని గుర్తించారు. బిడిఎస్ చేశానని చెప్పి తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యం అందిస్తున్న రమేష్ కుమార్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము వరకు మాత్రమే ఇతని సేవలు ఉండడం అతని సేవలపై అనుమానించిన వ్యక్తి ఎస్ ఓ టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేష్ గుప్తాను అదుపులోకి తీసుకుని తీసుకున్న ఎస్‌ఓటి పోలీసులు నేరేడ్‌మెట్ పీఎస్ లో అప్పగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button