
మళ్లీ చెప్తున్నా.. ఫార్ములా ఈ-కార్ రేస్ ఒక లొట్టపీసు కేసు: కెటిఆర్
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో కెటిఆర్ చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ ఒక లొట్టపీసు కేసు మాత్రమే అన్నారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు, లేని కేసును ఉన్నట్టుగా చూపి మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని నిన్న స్పీకర్‌ను అవకాశం ఇవ్వాలని కోరాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎవరికీ లబ్ధి జరిగిందో ఆ కంపెనీ పేరును కనీసం చార్జ్‌షీట్‌లో కూడా చేర్చలేదు. నా వల్ల ఒక్క పైసా ఎవరికైనా వెళ్లిందా అన్న అంశాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రస్తావించలేదు. ఇప్పటికీ డబ్బులు అక్కడే ఉన్నాయి.
తప్పుడు చార్జ్‌షీట్ తీసుకొచ్చి అక్రమ కేసు పెడుతున్నారు. బ్యాంక్ టు బ్యాంక్ డబ్బు ట్రాన్స్‌ఫర్ జరిగినట్టు ఉంది…అయితే రికవరీ ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం?. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు, ఎలక్ట్రిక్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ నిర్వహించాం….
దాని వల్ల సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.200 కోట్లు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీ పెట్టి రాష్ట్ర, దేశ పరువు పోయేలా చేశారు. నన్ను వేశ్యలా చూసారని మిలా మ్యాగీ స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది…
ఈ అంశంపై ఎలాంటి విచారణ చేశారు?. అక్రమ కేసులపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం…మాకు న్యాయం జరుగుతుంది. మేము భయపడము. రేవంత్ రెడ్డి లాగా చట్టాలను, న్యాయస్థానాలను చేతుల్లోకి తీసుకోము. ఫార్ములా ఈలో క్విడ్ ప్రో కో జరగలేదు…అయితే అందులో ఆ కంపెనీ పేరు ఎందుకు చేర్చలేదు?” అని కెటిఆర్ ప్రశ్నించారు.



