PoliticalTelangana

పాఠశాలలో బాలికపై లైంగికదాడి.. ఆలస్యంగా వెలుగులో

పాఠశాలలో బాలికపై లైంగికదాడి.. ఆలస్యంగా వెలుగులో

పాఠశాలలో బాలికపై లైంగికదాడి.. ఆలస్యంగా వెలుగులో

Web desc : పాఠశాల గ్రౌండ్లో ఆడుకుంటున్న చిన్నారికి ఐస్క్రీం ఇప్పిస్తామంటూ అదే పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఓ స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న ఐదేండ్ల చిన్నారికి ఐస్ క్రీం ఇప్పిస్తామంటూ 9వ తరగతి, 7వ తరగతి విద్యార్థులు ఇద్దరు పాఠశాల వెనక్కి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు.

సాయంత్రం బాధతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన చిన్నారిని తల్లి గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించాలని చెప్పగా.. సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించారు. లైంగికదాడి జరిగిందని, పోలీసులకు సమాచారమివ్వాలని వైద్యులు సూచించగా..

మంగళవారం చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.

కేసు దర్యాప్తు ముమ్మరం చేసి సదరు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ కేసును కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button