
ముదిగొండ పోలీసులు స్పీడ్ తో కుటుంబం చెంతకు సిల్వరాజు…_
సెల్వరాజును పట్టుకున్న ముదిగొండ పోలీస్ బృందం…
సిఐ వడ్డేపల్లి మురళీ ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోని సిల్వరాజ్ ఆచూకీ, పట్టివేత…
సీఐ మురళీని అభినందిస్తున్న జిల్లా పోలీస్ శాఖ, మండల ప్రజలు…
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
మండల పరిధిలోని పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, గ్రామ మాజీ సర్పంచ్ పాము సిల్వరాజు బుధవారం ఉదయం వాకింగ్ వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు కారు ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్లు సమాచారం అందటంతో రంగంలో దిగిన సిఐ వడ్డేపల్లి మురళీ వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టి తన పోలీస్ బృందంతో గంటల వ్యవధిలోని ఆచూకీ తెలుసుకొని వెంటనే పట్టుకోవడంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుండి మండల వ్యాప్తంగా సిల్వరాజు కిడ్నాప్ కలకాలంపై అనేక అపోహాలు వచ్చిన సిఐ మురళీ వ్యవహరించిన తీరు భేష్. సిల్వరాజు కిడ్నాప్ నుండి ప్రతి విషయాన్ని అణువణువుగా పరిశీలన చేసి తమకున్న అతి తక్కువ విలువైన సమయాన్ని ఎంతో వ్యూహాత్మకంగా అలోచన చేసి సిల్వరాజును కుటుంబ సభ్యుల చెంతకు చేరవేయడంతో అనేకమంది ప్రశంసలను పొందారు. మండల వ్యాప్తంగా సిఐ వడ్డేపల్లి మురళీపై మండల ప్రజలందరూ నీరాజనాలు పలుకుతున్నారు._



