
మద్యం మత్తులో పెట్రోల్ తాగి యువకుడు మృ*తి
మద్యం మత్తులో పెట్రోల్ తాగిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం లచ్చపేట శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.
దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన ఎండి.ఫయాజ్ (22)అనే యువకుడు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ, మద్యానికి బానిస అయ్యాడు.
ఈ క్రమంలో ఈనెల 16న దుబ్బాక పురపాలికలోని లచ్చపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల వెనక మద్యం మత్తులో తన ద్విచక్ర వాహనంలోని పెట్రోలు తాగి, స్నేహితుడు రాజుకు సమాచారం అందించాడు.
వెంటనే అక్కడికి చేరుకున్న స్నేహితుడు, కుటుంబ సభ్యులు ఎండి ఫయాజ్ను చికిత్స నిమిత్తం దుబ్బాక, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఎండి ఫయాజ్ మృతి చెందాడు. మృతుని చిన్నాన్న ఎండీ ఫరూక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



