PoliticalTelangana

ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టిన సర్పంచ్ భర్త!

ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టిన సర్పంచ్ భర్త!

ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టిన సర్పంచ్ భర్త!

Social media viral : నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఎంపీహెచ్ఎస్ మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక సర్పంచ్ భర్త విద్యార్థిని శీలానికి రూ. 20 లక్షలు వెలకట్టారట.

అసలు ఏం జరిగిందంటే.. మోమినపూర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే ఉపాధ్యాయుడు ఓ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా సర్పంచ్ భర్త గొల్ల రవి కుమార్ రూ. 20 లక్షలకు సెటిల్‌మెంట్ చేశాడు.

ఈ వ్యవహారం తెలిసినప్పటి నుంచి బయట వ్యక్తులకు తెలియకుండా ఉండేందుకు సహచర ఉపాధ్యాయులు గురునాథ్ రెడ్డి, కర్ని చెన్న కేశవులు ప్రయత్నించారు. కానీ.. ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుడు డబ్బులు ఇవ్వకపోవడంతో వీడియో బయటకు లీక్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

దీంతో పోలీసుల పోక్సో, ఐటీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి మొత్తం ఏడుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button