PoliticalSathupallyTelangana

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ సాదాలు నిర్వహిస్తోంది. గత రెండేళ్ల కాలంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఆర్ఐ, ఇంజనీరింగ్, అకౌంట్స్, పారిశుద్ధ్యం, బిల్ కలెక్టర్ తదితర విభాగాల్లో ఏసీబీ సిబ్బంది 15 మంది పలు విభాగాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు.

పలు విభాగాలలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మార్చి 31 కావటం మరోపక్క ఏసీబీ సత్తుపల్లి మున్సిపాలిటీలో సోదాలు నిర్వహించటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మున్సిపాలిటీ సిబ్బందిని బయటికి రాకుండా వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ సేకరించారు. ఒక్కొక్కరిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఇది ఇలా ఉండగా మరో ఏసీబీ అధికారుల బృందం మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ, మేనేజర్ మైసా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button