
పాఠశాల గేటు బయట యూకేజీ విద్యార్థిని.. మండుటెండలో పుస్తకాలతో కుస్తీ!
భూపాలపల్లి కేంద్రంలోని ఓ పాఠశాల యాజమాన్యం ఫీజుల పేరుతో వ్యవహరించిన తీరు అమానుషంగా ఉంది. చిన్నారి మండుటెండలో గేటు వద్దనే కూర్చోవడంతో పలువురు పాఠశాల యాజమాన్యం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు కోసం పిల్లలను వేధించడమేమిటిని ప్రశ్నిస్తున్నారు. ఫీజు బకాయిలు ఉందన్న సాకుతో ఓ యూకేజీ చిన్నారిని వారం రోజులుగా స్కూల్ బస్సు ఎక్కనివ్వకుండా సెయింట్ పీటర్స్ పాఠశాల యాజమాన్యం వేధిస్తున్నట్లు సమాచారం.
దీంతో చేసేదేమీ లేక ఆ చిన్నారి పాఠశాల గేటు ముందే నేలపై కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతుంది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిన్నారికి మద్దతుగా పాఠశాల ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.




