MedakPoliticalTelangana

ఆడపిల్ల పుట్టిందని కాపురానికి వద్దంటున్రు

ఆడపిల్ల పుట్టిందని కాపురానికి వద్దంటున్రు

ఆడపిల్ల పుట్టిందని కాపురానికి వద్దంటున్రు

Web desc : ఆడపిల్ల పుట్టిందని తన భర్త, అత్తమామలు కాపురానికి వద్దంటున్నారని ఓ వివాహిత సోమవారం మెదక్​ జిల్లా పోలీస్​ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ పట్టణంలోని కోలిగడ్డకు చెందిన సురభికి హైదరాబాద్‌కు చెందిన మామిండ్ల రాహుల్‌తో 2023లో పెండ్లి అయింది. ఆ టైంలో సురభి తల్లిదండ్రులు కట్నంగా సుమారు రూ.15 లక్షలు, 15 తులాల బంగారం, ఇతర సామాగ్రి ఇచ్చారు.

పెళ్లయిన మూడు నెలల తరువాత నుంచే అదనపు కట్నం కోసం భర్త రాహుల్, అత్త, మామలు, ఆడపడుచులు వేధింపులకు గురి చేసినట్లు సురభి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనకు ఆడపిల్ల పుట్టడాన్ని సాకుగా చూపుతూ తనను ఇంటి నుంచి బయటకు పంపించారని, రెండున్నర నెలలుగా తాను తన రెండున్నరేళ్ల వయసున్న కూతురుతో మెదక్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని తెలిపింది. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్న కుమార్​ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button