
కార్పొరేషన్ కార్యాలయంలో హల్ చల్… కాంట్రాక్టర్ పై మంత్రి తుమ్మల ఆగ్రహం
Web desc : ఒక కాంట్రాక్టర్ ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో హల్ చల్ చేస్తున్నాడు. ఖమ్మం కార్పొరేషన్ లోని ఇంజనీరింగ్ శాఖ విభాగంలోని ఏఈ లతో అంట కాగుతూ, వారు తీసుకుపోవలసిన ఫైళ్లను తానే స్వయంగా తీసుకువెళ్లి అధికారులకు అందిస్తున్నాడు.
అంతేకాకుండా అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను వారి బీరువాలోంచి తీస్తూ వారితో తనకు చనువు ఉందని షోయింగ్ చేయటం సదరు కాంట్రాక్టర్ కు అలవాటని కార్పొరేషన్ కార్యాలయంలో బహిరంగంగానే వ్యాఖ్యా నిస్తున్నారు.
తాను జమీందారీ వంశానికి చెందినవాడినని బహిరంగంగా చెప్పుకుంటూ… చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు… అన్న చందంగా వ్యవహరించిన పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఏ ఈ లతో అంట కాగుతూ..
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం వెనుక భాగంలో మెకానికల్ షెడ్ నిర్మాణం కోసం దొడ్డి దారిన కాంట్రాక్టు ద గ్గించుకున్న సదరు కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈలతో వంటకాకుతో తన పనులను చేసుకుంటానని ఆరోపణలు వస్తున్నాయి వాస్తవంగా కాంట్రాక్టర్లకు సంబంధించిన ఫైళ్ళు ఉండే డ్రాయింగ్ విభాగంలో ఎవరికి అనుమతి ఉండదు .
అయితే ఈ కాంట్రాక్టర్ మాత్రం నేరుగా ఉద్యోగి మాదిరిగా వెళ్లి బీరువాలో ఉన్న ఫైళ్లను తీసుకోవడం ప్రస్తుతం కార్పొరేషన్ కార్యాలయంలో చర్చాంశనీయం అయింది. అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు డివిజనల్ ఇంజనీర్లకు భారీగా ముడుపులు ఇవ్వటం వల్లే సదరు కాంట్రాక్టర్ ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి.
సదరు కాంట్రాక్టర్ పై మంత్రి తుమ్మల ఆగ్రహం
ఖమ్మం కార్పొరేషన్ లో హల్ చల్ చేస్తున్న సదరు కాంట్రాక్టర్ పై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో కష్టపడి ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే, కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరించి అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ శ్రీధర్ చేపడుతున్న పనులపై తమకు నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
కేఎంసీ కమిషనర్ ఆరా.. కాంట్రాక్టర్ శ్రీధర్ దక్కించుకున్న పనుల పట్ల ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆరా తీశారు.
సదరు కాంట్రాక్టర్ కు ఎందుకు సహకరిస్తున్నారు అంటూ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో తాను విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.



