
ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
Social media viral : చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రజలకు మేలు చేసే పనులుచేస్తారు. బాధితులకు అండగా నిలబడతారు. మరోవైపు కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. వేసుకున్న ఖాకీ దుస్తుల పరువు తీసేలా ప్రవర్తిస్తారు. ఏదైన సమస్య ఉందని పీఎస్ కు వస్తే వేధింపులకు గురిచేస్తారు. అంతే కాకుండా లంచం ఇవ్వాలని, లైంగికంగా కూడా టార్చర్ చేస్తారు.
ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం. పల్నాడులోని మాచర్ల నియోజక వర్గంలో ఒక ఏఎస్సై మొత్తంగా డిపార్ట్ మెంట్ పరువు తీసేలా ప్రవర్తించాడు. ఏకంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేశాడు.
ఈ ఘటన ఏపీలో దుమారంగా మారింది. పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో ఒక ఏఎస్సై నియోజక వర్గం పరిధిలో పర్యాటక ప్రాంతంలలో తరచుగా తిరిగే జంటలను టార్గెట్ చేశాడు. దీనికి జమ్మల మడుగుకు చెందిన ఆటో డ్రైవర్ సాయం తీసుకున్నాడు. ఇతనిలో వారి ఏకంతంగా , రొమాన్స్ చేసుకుంటుండగా వీడియోలు, ఫోటోలు తీయాలని చెప్పేవాడు.
మాచర్లలో ఒక ఏఎస్ఐ (ASI) సాగిస్తున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. మాచర్లకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇందుకోసం జమ్మలమడకకు చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను తన ఇన్ఫార్మర్‌గా నియమించుకున్నాడు.
ఎక్కడైనా జంటలు ఏకాంతంగా కనిపిస్తే, సదరు ఆటో డ్రైవర్ ద్వారా వారిని రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు ఏఎస్ఐ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాడు. వారి ఏకాంత వీడియోలు చూపిస్తూ ఆ జంటలను భయభ్రాంతులకు గురిచేయడం ఈ కిలేడి ఏఎస్ఐకి పరిపాటిగా మారింది.
వీడియోలు బయటపెడతామని, కేసు పెడతామని బెదిరించి బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం డబ్బుతోనే ఆగకుండా, తన వికృత కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.
వీడియోలను సాకుగా చూపి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరాచకాల్లో సదరు ఏఎస్ఐ ఒక్కడే కాదు, మరో ఏఎస్ఐ మరియు ఒక కానిస్టేబుల్ కూడా భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం.
వీరంతా ఇదే తరహాలో మహిళలను లోబర్చుకుంటూ, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేటగాళ్లుగా మారడంతో సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.



