KhammamPoliticalTelangana

క్షయ వ్యాధి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా తగ్గే జబ్బు

క్షయ వ్యాధి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా తగ్గే జబ్బు

క్షయ వ్యాధి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా తగ్గే జబ్బు
అపోహలు వీడి అవగాహన పెంచుకోండి.

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
మండలంలోని పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ లో క్షయ వ్యాధి క్యాంపు గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ ప్రారంభించడo జరిగినది.
ఈ సందర్భంగా డా. అల్తాఫ్ మాట్లాడుతూ ఈ క్యాంపు గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే గ్రామ ప్రజలకు క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, మరియు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి వివరించారు.
క్షయ వ్యాధిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని,
ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు.
క్షయ వ్యాధి పూర్తిగా నయం అయ్యే జబ్బు అని, దీనికి సంబంధించిన పరీక్షలు మరియు మందులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ క్షయ నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి గ్రామపంచాయతీని క్షయ రహిత గ్రామ పంచాయతీగా తీర్చి దిద్ది ,మార్చాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో క్షయ వ్యాధిపై ఉన్న భయాలు, అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రతి గ్రామంలో క్షయ నిర్ధారణ క్యాంపులు నిర్వహిస్తూ, పోర్టబుల్ ఎక్స్-రే ద్వారా పరీక్షలు కూడా చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ జానకి రాములు డా. అల్తాఫ్ గారు, టిబి సూపర్వైజర్ ఇమా మ్, STLS మహేష్ ఎక్స్-రే టెక్నీషియన్ కనుక రావు,ఏఎన్ఎం సంధ్య ఆశా కార్యకర్తలు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button