EducationNationalNotificationPolitical

9,175 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాస్ అయితే చాలు..

9,175 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాస్ అయితే చాలు..

9,175 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాస్ అయితే చాలు..

మీకో శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం 9175 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ (టెక్నికల్/ట్రేడ్స్‌మ్యాన్/పయనీర్ – పురుషులు/మహిళలు) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మరో 5 రోజుల్లో అంటే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది.

చివరి తేదీ మే 19, 2026 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి.. పరీక్ష విధానం, ఫీజు, ఇతర మినహాయింపులు ఏంటి అంటే..

అర్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావించే

అభ్యర్థులు : ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.

దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో అనుభవం, ఐటీఐ సర్టిఫికేట్, లేదా హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయసు : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు జనవరి 1, 2026 నాటికి

కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు అభ్యర్థుల వయస్సు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర అన్ని పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయో సడలింపు : రిజర్వ్డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది.

ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ. 100 రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం : ఈ నియామకంలో ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) / నైపుణ్య పరీక్ష / PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్ / వైద్య పరీక్ష (DME/RME) మొదలైన వాటి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం : ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ 3 ప్రకారం నెలకు రూ. 21,700 – రూ. 69,100 జీతం అందిస్తారు.

దరఖాస్తు విధానం : ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు CRPF అధికారిక వెబ్‌సైట్, rect.crpf.gov.in ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button