Bhadradri KottagudemMahabub badPoliticalTelangana

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనం పోరాటం...

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనం పోరాటం...

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌనం పోరాటం…

ఇల్లెందు: ప్రేమ పేరుతో మోసం చేసి ముఖం చాటేసిన యువకుడి ఇంటి ముందు యువతి బైఠాయించిన సంఘటన ఇల్లెందు మండలం ధనియాలపాడు పంచాయతీ బాలాజీ తండాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని రేగుల తండాకు చెందిన భూక్య వెన్నెల తన అమ్మమ్మ స్వగ్రామమైన బాలాజీ తండాలో కొద్ది రోజులు ఉంది. ఈ క్రమంలో బాలాజీ తండాలోని నునావత్ మహేందర్‌తో నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగింది.

ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమ వివాహం చేసుకుంటే కట్నం రాదని దురుద్దేశంతో యువతికి దూరమవుతూ వచ్చాడు. ఫోన్ చేస్తే స్పందించకపోవడం వల్ల యువతి మనస్తాపానికి గురై ఉరివేసుకుని చనిపోయేందుకు సిద్ధపడింది.

నాతో పాటు నా తల్లిని కూడా కొట్టారు.. యువతి తల్లి విషయం తెలుసుకుని, యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసేందుకు నాలుగు రోజులుగా యువకుడి స్వగ్రామానికి పెద్దలతో వచ్చివెళ్తుంది.

నాలుగు రోజులుగా రేపు మాపు అంటూ కాలం వెళ్ళబుచుతున్న తరుణంలో బుధవారం యువతి భూక్య వెన్నెల ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.

దీంతో యువకుడి కుటుంబ సభ్యులు యువతి, యువతి తల్లిపై దాడి చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా యువతి భూక్య వెన్నెల మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేశాడని పేర్కొంది. న్యాయం కోసం ఇంటికి వస్తే తనతో పాటు తన తల్లిని విచక్షణారహితంగా కొట్టారని ఏడ్చుకుంటూ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button