
Web desc : భార్యాభర్తల గొడవ విషయంలో రూ. 60000 డిమాండ్ చేసి 20,000 లంచం తీసుకుంటూ వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్సై రాణి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
బాధితుడు తాండూర్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఏర్షాద్ లంచం ఇస్తుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ బృందం వారిని పట్టుకున్నారు.
ఏర్షాద్ తన భార్య గొడవ పడడంతో వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఏర్షాద్ కుటుంబ సభ్యులకు కేసు నమోదు చేశారు.
తన కుటుంబ సభ్యులకు బెయిల్ ఇవ్వాలని బాధితులు కోరగా ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆరుగురికి 60,000 లంచం అడిగినట్లు బాధితులు వివరించారు. దీంతో అవినీతి అధికారిణి ఎలాగైనా పట్టించాలని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ బృందం ఇక్కడికి వచ్చి లంచం ఇస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఎక్కడైనా అవినీతి అధికారులు లంచం కోసం పీడిస్తుంటే ఏసీబీ అధికారులను సంప్రదించి, వారి ఆట కట్టించి తగు న్యాయం పొందాలని ఆయన సూచించారు.




