HyderabadPoliticalTelangana

హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్‌చల్...

హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్‌చల్...

హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్‌చల్…

Web desc : హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వ్యక్తి హై వోల్టేజ్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నిస్తూ హల్‌చల్ సృష్టించడం కలకలం రేపుతోంది. బోరబండ మోతీనగర్ చౌరస్తా వద్ద నిల్సన్ రాజ్ అనే వ్యక్తి ఈ ఘటనకు కారణమయ్యాడు.

తనపై ఓ యువతి తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపిస్తూ, చేతిలో పెట్రోల్ బాటిల్‌తో హై వోల్టేజ్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకుని, అతన్ని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button