
•పాతర్లపాడు పిల్లలు రోజూ ఎదుర్కొంటున్న వాస్తవం…
•ఎప్పుడు స్పందిస్తారు సార్.
•రవాణా సౌకర్యం లేక ట్రాక్టర్లో కాలేజీకి వెళ్తున్న పాతర్లపాడు విద్యార్థులు.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
ఖమ్మం జిల్లా, పాతర్లపాడు గ్రామం నుండి నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లడానికి కనీస రవాణా సౌకర్యం కూడా లేదు. విద్యార్థులు చదువుకోవడానికి ట్రాక్టర్ ట్రాలీలను ఆశ్రయించాల్సి వస్తుంది.
విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఆ విద్యను అందుకోవడానికి కనీస భద్రత కూడా లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా ఈ పిల్లలకు దిక్కు లేదు. ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాయి. కానీ ఒక గ్రామానికి కళాశాలకు మధ్య కనీస రవాణా సౌకర్యం కల్పించలేకపోతున్నాయి.
ఇది కేవలం పాతర్లపాడు సమస్య కాదు. ఇది మన వ్యవస్థలోని లోపానికి నిదర్శనం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాతర్లపాడు నుండి నాగులవంచకు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తరపున కోరుతున్నాము.




