
కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు…
యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి పేరు, డీపీతో వాట్సాప్‌లో వచ్చిన ఫేక్ మెసేజ్‌లు కలకలం సృష్టించాయి.
63747 83161 అనే నంబర్‌తో పలువురికి వాట్సాప్‌లో ‘హలో హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ ఎట్ ద మూమెంట్’ అనే మెసేజ్‌లు వచ్చాయి.

కలెక్టర్ ఫొటోతో సైబర్ నేరగాళ్లే ఈ మెసేజ్‌లు పంపుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. కాగా, తన పేరుతో ఫేక్ మెసేజ్‌లు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి.. ఆ మెసేజ్‌లకు ఎవరూ రెస్పాండ్ కావొద్దని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.




