
ఆయిల్ పామ్ తో అధిక దిగుబడులు
ఏఈఓ భువనేశ్వరి
మే 04 (సీ కే న్యూస్) చేగుంట : రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకొని విత్తనాలు వేసుకోవాలని రైతులకు చందాయిపేట్ క్లస్టర్ వ్యవసాయ అధికారి భువనేశ్వరి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో రైతు వారోత్సవాల భాగంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ,ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని పంటలు వేసుకోవాలని, ఏ పంట సాగు చేస్తే,అధిక దిగుబడి వస్తుందో రైతులకు అవగాహన కల్పించారు . పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు, భూసార ఫలితాలు మేలు చేస్తాయని ఆమె అన్నారు,
పంటలు సాగు చేసేందుకు రైతులు సేంద్రీయ ఎరువులు వేయాలని పొలంలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు మట్టి నమునా తీసే సమయంలో వి ఆకారం లో 15- 20 సెంటీమీటర్ల లోతు వరకు పారతో గుంత తీసి, పై పొర నుంచి కింది వరకు ఒకే పక్కగా మట్టిని స్వీకరించాలని , అలా తీసిన మొత్తం శ్యాంపిళ్లను కలిపినా వెలుగు, భాగాలుగా విభజించి,వాటిని ల్యాబ్ కు పంపాలని ఏఈవో భువనేశ్వరి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరీ సాయిబాబా, కసన్ పల్లి సర్పంచ్ , బిక్య నాయక్, ఉపసర్పంచ్ పబ్బ నాగేష్ గుప్త, మల్లారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ మెహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, రైతులు ఆనందాస్ ఆంజనేయులు, బాస రాజు, సాయిబాబా, రమేష్, శోభన్, తదితరులు పాల్గొన్నారు.




