
ఏసీబీ వలలో అటవీ శాఖ పెద్ద తలలు…
రూ 3. 5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డి ఓ, డి ఆర్ ఓ
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మే 07,
ఒక రోడ్డు వేస్తుండగా కొన్ని చెట్లు కట్ కావడం తో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి ఓ సుజాత రూ పది లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆమెను, చర్ల ఇంచార్జ్ డి ఆర్ ఓ కృష్ణయ్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతం లో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బ తిన్నాయి.
ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డి ఓ సుజాత పది లక్షలు డిమాండ్ చేసి భద్రాచలం కార్యాలయం లో 3.5 లక్షలు లంచం తీసుకుంటు డి ఆర్ ఓ తో పాటు పట్టుబడ్డారు. గతం లో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. అటవీ శాఖ లో అవినీతి పేరుకుపోయింది.




