
బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని మెడికవర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.
బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర మనస్తాపానికి శకుంతల గురయ్యారు. ఆమెకు మెడికవర్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలియగానే మెడికవర్ ఆస్పత్రికి బండి సంజయ్ చేరుకున్నారు. తన అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.



