
పసి ప్రాణం ముఖాన్ని పీక్కుతిన్న కుక్కలు
Web desc : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసిపోయేలా ముక్కు పచ్చలారని అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో పడేసిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం ప్రకార… అచ్చంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీ గౌతమి స్కూల్ వెనుక భాగంలో ఒకటి రెండు రోజుల క్రితం ఏదో ఒక ఆసుపత్రిలో జన్మించిన పసి గుడ్డు ( ఆడబిడ్డ ) ను గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్ల పొదలలో పడేయడంతో ఆ పసిగుడ్డు ముఖాన్ని కుక్కలు పూర్తిగా పీకత్తిని కనిపించింది.
కారణానికి ఒడిగట్టింది వారే..?
ఆ పసి గుడ్డును కాలనీలోని ఒక ఇంటి ముందు మెట్ల వద్ద కుక్కలు తీసుకొచ్చాయా..? లేక ఎవరైనా వ్యక్తి తీసుకొచ్చి డెడ్ బాడీని పడేశారా ? ఒకవేళ కుక్కలే తీసుకుని వస్తే చెట్లపొదల్లోకి వెళ్లి మరింత చంద్రం చేస్తాయి కదా ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణానికి ఒడిగట్టింది ముమ్మాటికి ప్రైవేటు ఆసుపత్రి వారే ఒడిగట్టి ఉంటారని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
హుటాహుటిన విచారణ చర్యలు…
విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు పసి గుడ్డు మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా.. ఓ పసిపాప చనిపోయిన మృతదేహాన్ని ఉదయం 7:30 గంటలకు కానిస్టేబుల్ తీసుకొచ్చారని డెడ్ బాడీని మార్చురీలో ఉంచామన్నారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎస్సై సద్దాం తన సిబ్బందితో హుటాహుటిన విచారణ చర్యలు వేగవంతం చేశారు.
కాలనీవాసులు ఏమంటున్నారంటే..!
పట్టణంలోని ఘటన సమీప కాలనీవాసులు తెలుపుతున్న సమాచారం మేరకు ప్రతిరోజు రాత్రి 10 గంటల సమయంలో వివిధ ఆసుపత్రులకు చెందిన వారు ఆస్పత్రి వ్యర్థాలను, చెత్తను కాలనీ ద్వారా పెద్దపెద్ద ప్లాస్టిక్ డబాలల్లో తీసుకెళ్లి పారేస్తూ ఉంటారని, ఈ దారుణానికి తప్పకుండా చెత్తను పడేస్తున్న ఆసుపత్రి వర్గాలే ఆ ప్రమాదానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




