
ఓటమి గెలుపుకు తొలిమెట్టు… మంత్రి వాకిటి శ్రీహరి..
సికే న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ :
ఓటమి గెలుపుకు తొలిమెట్టని అన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. గచ్చిబౌలి లో దాదాపు నెల పైగా సాగిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు వేడుకలకు తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేనా రెడ్డి,తో కలిసి ముఖ్య అతిథి గా హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ…. ఏప్రిల్ 24 నుండి జూన్ 7 వరకు జరిగిన ఈ సమ్మర్ క్యాంపు లో 600 మంది విద్యార్థులు పాల్గొనడం అభినoదనీయమన్నారు. ప్రతీ సంవత్సరం వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. చిన్న చిన్న సమస్యలకు విద్యార్థులు మానసికంగా కుంగి పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు క్రీడలు మాత్రమే మానసిక, శారీరక ధ్రుడత్వాన్ని కలగ జేస్తాయని తెలిపారు.ఓటమికి కుంగిపోకుండా మళ్ళీ ఎలా విజయం సాధించాలనే కసి విద్యార్థులకు పెరగాలన్నారు.
విద్యార్థులు ఫోన్ లకు అలవాటు పడకుండా మైదానాలకు అలవాటు పడాలని హితబోధ చేశారు. మత్తు వదలి మైదానాలు చేరాలనే నినాదం తో ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేశారు.ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్నీ మైదానాలను అభివృద్ధి చేసి మంచి నైపుణ్యం ఉన్న కోచ్ లను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈసారి క్రీడలకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు.సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో భాగంగా దాదాపు 3 లక్షల మంది పిల్లలు గ్రామీణ,మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లో క్రీడలు ఆడారని మంత్రి పేర్కొన్నారు .ఇప్పుడు 3వ ఎడిషన్ లో 5 లక్షల క్రీడాకారులను పాల్గొనేలా చేయడమే ధ్యేయం గా పెట్టుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.ఈ సందర్బంగా సమ్మర్ క్యాంపు లో శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన లభించిందని నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానాలన్నీ క్రీడాకారులతో కళకళలాడాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు కోచులు పాల్గొన్నారు.




