
గద్వాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగి నిర్లక్ష్యం..
సీకే న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా కెమెరామెన్ బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల: ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ ఫోటో ఒక నిదర్శనం.
గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధుల సమయంలోనే ఒక ఉద్యోగి కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న దృశ్యం కనిపించింది. టేబుల్ మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లు ఉండగా, ప్రజలు పనుల కోసం వేచి చూస్తున్న సమయంలో ఉద్యోగి నిద్రలోకి జారుకున్నాడు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం గంటల తరబడి ఎదురుచూసే ప్రజలకు ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారింది.జీతం ప్రజల సొమ్ము, డ్యూటీలో నిద్రా?” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




