
TGPSC భారీ నోటిఫికేషన్: ఉపాధ్యాయులకు గోల్డెన్ ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. పోస్టు పేరు: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I
మొత్తం ఖాళీలు: 24.
విభాగాల వారీగా ఖాళీలు
మల్టీజోన్- I (10): అన్ రిజర్వ్డ్ 01, లోకల్ 09 (అన్ రిజర్వ్డ్ 02, ఈడబ్ల్యూఎస్ 01, బీసీ-ఏ 1, బీసీ-బీ 1, బీసీ-సీ 0, బీసీ-డీ 0, బీసీ-ఈ 0, ఎస్సీ-I 01, ఎస్సీ-II 01, ఎస్సీ-III 0, ఎస్టీ-0, పీహెచ్ 01) .
మల్టీజోన్–II (14): అన్ రిజర్వ్డ్ 01, లోకల్ 13 (అన్ రిజర్వ్డ్ 05, ఈడబ్ల్యూఎస్ 01, బీసీ-ఏ 1, బీసీ-బీ 1, బీసీ-సీ , బీసీ– 0, బీసీ–ఈ 0, ఎస్సీ–I 01, ఎస్సీ–II 01, ఎస్సీ–III 0, ఎస్టీ-1, పీహెచ్ 01) .
ఎలిజిబిలిటీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఈడీలో ప్రవేశానికి అర్హత గల సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం కంటే తక్కువ కాకుండా మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 12.
అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీలకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.
పరీక్ష ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.120 చెల్లించాలి.
లాస్ట్ డేట్: జులై 19.
పరీక్ష తేదీ: 2026, అక్టోబర్ (తాత్కాలికం)
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.tgpsc.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–Iలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు. పేపర్-IIలో పార్ట్-ఏ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి 75 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. పార్ట్-బీలో ఎడ్యుకేషన్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ 75 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు. అంటే పేపర్-IIలో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు.




